Wednesday, May 29, 2024

MDK : బాధిత కుటుంబానికి ఆర్థిక‌సాయం అంద‌జేత

నార్సింగి, మే 16(ప్ర‌భ‌న్యూస్‌) : మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రానికి చెందిన ముత్తొల్లబాబు పక్షవాతంతో ఇవాళ మృతి చెందాడు. బాబు నాలుగు సంవత్సరాల క్రితం గ్రామపంచాయతీ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన పక్షవాతానికి గురై గురువారం ఉదయం మృతి చెందాడు.

- Advertisement -

బాబుది నిరుపేద కుటుంబం. ఈ విష‌యం తెలుసుకున్న మాజీ స‌ర్పంచ్ రాయ‌ల‌పురం సుజాత శ్రీ‌నివాస్ ఆ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి ధైర్యం చెప్పారు. అనంత‌రం రూ. 5వేల ఆర్థిక‌సాయం అంద‌జేశారు. మృతునికి భార్య సంగీత పిల్లలు జెస్సి రాబిన్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement