Wednesday, November 6, 2024

MDK | గజ్వేల్ లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

గజ్వేల్, అక్టోబర్ 21 (ఆంధ్రప్రభ) సికింద్రాబాద్ లో హిందువులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన లాఠీ ఛార్జీకి నిరసనగా సోమవారం గజ్వేల్ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అంబెడ్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, మండల అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్ లు మాట్లాడుతూ… మతోన్మాదులకేమో రక్షణ.. హిందువులకేమో శిక్ష అని మత రాజకీయానికి మూలం కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు.

సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద బీజేపీ కార్యకర్తలు, భక్తులపై పోలీసుల లాఠీఛార్జి దారుణ‌మ‌న్నారు. హిందువుల పట్ల విద్వేషాన్నినింపి, ముత్యాలమ్మ దేవాలయంపై దాడికి ప్రేరేపించిన సదస్సులో పాల్గొన్న వారికి ప్రత్యేక రక్షణ కల్పించి సురక్షితంగా ఊళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం దాటిస్తుందన్నారు. ఇలాంటి మతోన్మాద శక్తులు విరుచుకుపడకుండా చూడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మాదాడి జశ్వంత్ రెడ్డి, బీజేపీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు కుడిక్యాల రాములు, బీజేపీ అసెంబ్లీ కో-కన్వీనర్ ఎల్కంటి సురేష్, బీజేపీ నాయకులు సిల్వేరు జనార్దన్, మామిళ్ళ నాగు ముదిరాజ్, బీజేపీ పట్టణ, మండల ప్రధాన కార్యదర్శిలు, ఐల మహేందర్, మంద వెంకట్, పంజాల వెంకట్ గౌడ్, పట్టణ, ఉపాధ్యక్షులు నాయిని సందీప్, నరసింహా, వెంకటరెడ్డి, కిష్ట గౌడ్, వడ్డేపల్లి ప్రసాద్, బార్ అరవింద్, భీమ్ కుమార్, కొన్నే రాజశేఖర్ రెడ్డి, ఇప్ప స్వామి, బీజేవైఎం జిల్లా కోశాధికారి ఆర్కే యాదవ్, యువ, కిసాన్ ఓబీసీ మోర్చాల అధ్యక్షులు మెతుకు కర్ణాకర్, సాయి కుమార్, శాతం స్వామి, రాజు, నాయకులు, తిప్పతి నరేష్, సందరి రాజు, శివ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement