Saturday, April 27, 2024

ఫ్యాన్స్ మీకేనా… మాకుండరా: మీ అభిమాన జంతువు

అభిమాన హీరోల సినిమాలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తే ఆ కిక్ వేరేగా ఉంటుంది. ఇక అగ్ర హీరోల ఫ్యాన్స్ అయితే వారి కటౌట్లను పెట్టి మరీ పాలాభిషేకాలు పూజలు చేస్తారు. మా హీరో గొప్పవాడు అంటూ కటౌట్లు కడతారు. అయితే విజయవాడలో మాత్రం ఓ సినిమా పోస్టర్ అందరిని ఆకట్టుకుంటుంది. అది గాడ్జిల్లా vs కాంగ్ సినిమా కు సంబంధించిన పోస్టర్. ఆ పోస్టరు పెట్టింది ఎవరో కాదు… అఖిల భారత తెలుగు కింగ్ కాంగ్ యువత. అంతేకాదు ఆ పోస్టర్ లో చిత్రం విడుదల సందర్భంగా విచ్చేయుచున్న మా అభిమాన జంతువు.. కింగ్ కాంగ్ అభిమానులకు, థియేటర్ యాజమాన్యానికి ఇవే మా శుభాకాంక్షలు. ఈ చిత్రం ఘన విజయం సాధించి హాలీవుడ్ డబ్బింగ్ చిత్రాల లో రికార్డులు సృష్టించాలని కోరుకుంటూ మీ అఖిల భారత తెలుగు కింగ్ కాంగ్ యువత అంటూ రాసుకొచ్చారు.

అంతేకాదు వరల్డ్ వైడ్ కింగ్ కాంగ్ ఫ్యాన్స్, ప్రెసిడెంట్, అలాగే చైర్మన్, అసోసియేషన్ ఫౌండర్, కాంగ్ డై హార్డ్ ఫాన్స్ పేర్లతో సహా పోస్టర్లు వేయించారు. ఇక ఈ పోస్టర్ ని చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. హీరోలకే కాదు జంతువులకి కూడా ఫ్యాన్స్ ఉంటారు… పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ తో పాటు కాంగ్ కి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటూ సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు తెలుగు హీరోల ఫ్యాన్స్ మాత్రం మన హీరోలకే కాంగ్ పోటీ వస్తున్నదేంట్రా అంటూ సరదాగా మాట్లాడుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement