Monday, April 15, 2024

పెద్దశెట్టిపల్లెలో నీటి క‌ష్టాలు..

ప్రొద్దుటూరు మండలంలోని మేజర్ పంచాయతీ అయిన పెద్ద శెట్టిపల్లె గ్రామంలో గత కొన్ని రోజులుగా నీటి సమస్య వుందని గ్రామస్థులు పేర్కొన్నారు. వివరాల్లోకెళితే…. పెద్ద శెట్టిపల్లె గ్రామంలోని పలు చోట్ల నీరు రాక ఇబ్బందులు పడాల్సి వస్తోందని గ్రామస్థులు వాపోయారు. నీటి కోసం చాలా దూరం వెళ్లి బండ్లు, తదితరాలపై తెచ్చుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. కాగా ఈ విషయమై తాము పలుసార్లు అధికారులకు విన్నవించామని పేర్కొన్నారు. అయినా ఫలితం లేదన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోని తమకు నీటి సమస్య తొలగించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement