Saturday, May 4, 2024

ఖిలాడీ నుండి 5వ సాంగ్ – పోస్ట‌ర్ రిలీజ్

ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ తెర‌కెక్కిస్తోన్న మూవీ ఖిలాడీ. ఈ చిత్రంలో హీరో ర‌వితేజ న‌టిస్తున్నాడు. ఇది యాక్ష‌న్, క్రైమ్ థ్రిల్ల‌ర్ చిత్రం. ఈ సినిమాను ఏ స్టూడియేస్‌ ఎల్‌ ఎల్పీ పతాకంపై సత్య నారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కు సౌండ్‌ ట్రాక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ దేవి శ్రీ ప్రసాద్‌ స్వర పరస్తున్నారు. కాగా ఈ సినిమా ఫిబ్రవరి 11వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, ముకుందన్‌, మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా కిలాడి మూవీ నుంచి మరో అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి 5వ పాటను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. క్యాచ్ మీ అనే 5వ సాంగ్ ను ఫిబ్రవరి 5వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా వదిలింది రిలీజ్ చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement