Thursday, May 16, 2024

AP – ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వివాదం – సి ఐ డి విచారణ కు ఈసి ఆదేశం…

ఎపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై వివాదం ముదురుతోంది. ఈ చట్టం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల అస్త్రంగా మారిందని పలువురు అంటున్నారు.

ప్రతిపక్ష పార్టీల నాయకులు పలు సభల్లో తమ ప్రసంగాల్లో భాగంగా ఈ యాక్ట్ గురించి నెగిటివ్ గా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ నాయకులు ప్రతిపక్ష పార్టీలపై ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఈసీకి చెప్పుకొచ్చారు. దీనిని సీరియస్ గా తీసుకున్న ఈసీ తాజాగా పూర్తి విచారణ జరపాలని సీఐడీని ఆదేశించింది.

- Advertisement -

ఇదిలా ఉండగా.. ఏపీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు

ప్రధాన ఆస్త్రంగా మారింది. కూటమి పార్టీలు ఈ చట్టంతో మీ భూములను ప్రభుత్వం లాగేసుకుందని ప్రచారం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

సీఎం జగన్ దీనిపై స్పష్టత ఇచ్చారు. భూ వివాదాల వల్ల రైతులు, ప్రజలందరూ కూడా అధికారులు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉందని జగన్ గుర్తు చేశారు. ప్రజలు ఎవరూ కూడా ఎవరి చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి రాకూడదని అభిప్రాయపడ్డారు. ఈ భూములపై ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందని స్పష్టం చేశారు. తాజాగా ఈ అంశంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది.

అయితే.. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా “వైసీపీ అధికారంలోకి వస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలు చేస్తారు, దీంతో మీ ఆస్తులు జగన్ ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు జిరాక్స్ పత్రాలు మాత్రమే ఇస్తారు. ఇది జగన్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్. జగన్ ఓ ల్యాండ్ గ్రాబర్” అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. సీఐడీ విచారణ అనంతరం ఈసీ ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. .

Advertisement

తాజా వార్తలు

Advertisement