Saturday, May 18, 2024

అటెంప్ట్​ మర్డర్​ కేసులో కేంద్ర మంత్రి కుమారుడు లొంగుబాటు.. బెయిల్​ తిరస్కరించిన కోర్టు

హత్యాయత్నం కేసులో కేంద్ర మంత్రి కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే ఇవ్వాల మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కోర్టులో లొంగిపోయారు. కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణే కుమారుడు అయిన నితీష్‌ రాణేను జ్యుడీషియల్‌ కస్టడీకి పంపినట్లు స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ప్రదీప్‌ ఘరత్‌ తెలిపారు. అంతకుముందు రోజు నితీష్ రాణే బాంబే హైకోర్టు నుండి తన బెయిల్ పిటిషన్‌ను వాపస్​ తీసుకున్నారు. కాగా, లొంగిపోయి విచారణ ఎదుర్కోవాలని  భావిస్తున్నట్లు అతని లాయర్ తెలిపారు. అయితే జిల్లా,  అదనపు సెషన్స్ జడ్జి (సింధుదుర్గ్) నిన్న అతని బెయిల్ పిటిషన్​ని తిరస్కరించడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది.  

హత్యాయత్నం కేసు దర్యాప్తు అసంపూర్తిగా ఉన్నందున నితీష్ రాణేను కస్టడీలో ఉంచడం అవసరమని కోర్టు పేర్కొంది. సింధుదుర్గ్ జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల ప్రచారంలో శివసేన కార్యకర్త సంతోష్ పరాబ్‌పై దాడికి సంబంధించి ఈ కేసు నమోదైంది. గత నెలలో ముంబయిలోని రాష్ట్ర శాసనసభ సముదాయం వెలుపల అవహేళన చేసిన  ఘటనతో తనను కించపరిచినట్లు భావించిన బిజెపి ఎమ్మెల్యే (మహారాష్ట్రలో MVA సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న) అధికార శివసేన తనను టార్గెట్​ చేసిందని ఆరోపించారు. డిసెంబర్ 23న శాసనసభ శీతాకాల సమావేశాల సందర్భంగా మంత్రి, శివసేన నాయకుడు ఆదిత్య ఠాక్రేను “మియావ్ మియావ్” అని ఎగతాళి చేశారని శివసేన ఎమ్మెల్యే  ఆరోపించడం కూడా వివాదానికి దారితీసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement