Tuesday, May 28, 2024

MI : హార్దిక్ పాండ్యాకు షాక్… ఒక మ్యాచ్ ఆడ‌కుండా నిషేధం…

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ 2025లో తొలి మ్యాచ్‌ ఆడకుండా హార్దిక్‌పై బీసీసీఐ నిషేధం విధించింది. ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం రాత్రి వాంఖడే స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై స్లో ఓవర్ రేట్‌ను నమోదు చేసినందుకు గాను హార్దిక్‌పై బీసీసీఐ చర్యలు తీసుకుంది.

ఓ మ్యాచ్ నిషేధంతో రూ. 30 లక్షల భారీ జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఐపీఎల్ 2024లో హార్దిక్ స్లో ఓవర్ రేట్‌ను నమోదు చేయడం ఇది మూడోసారి.

స్లో ఓవర్ రేట్‌ను నమోదు చేసినందుకు హార్దిక్‌ పాండ్యాకు రూ. 30 లక్షల భారీ జరిమానా ఐపీఎల్ నిర్వాహకులు విధించారు. హార్దిక్‌తో పాటు ముంబై ఇండియన్స్ తుది జట్టులో ఆడిన ఆటగాళ్లకు (ఇంపాక్ట్ ప్లేయర్ సహా) రూ. 12 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 50 శాతం (ఏదీ తక్కువగా ఉంటే అది) జరిమానా విధిస్తున్నామని ఐపీఎల్ నిర్వాహకులు పేర్కొన్నారు. స్లో ఓవర్ రేట్‌ కారణంగా ఐపీఎల్ 2024లో రిషబ్ పంత్ కూడా ఓ మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement