Thursday, July 25, 2024

Delhi | ఈడీ వాద‌న‌ల‌లో కేసీఆర్ పేరు రాలేదు : కవిత లాయర్

ఢిల్లీ లిక్కార్ స్కామ్ కేసులో కవిత బెయిల్‌ కోసం జరిగిన వాదనల్లో ఈడీ మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు (కేసీఆర్‌) పేరును ప్రస్తావించిందంటూ వచ్చిన ప్రచారాన్ని ఆమె తరఫు న్యాయవాది మోహిత్‌ రావు ఖండించారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు… ఈడీ వాదనల్లో కేసీఆర్‌ ప్రస్తావన ఎక్కడా రాలేదన్నారు.

కోర్టులో ఈడీ న్యాయవాదులు ప్రస్తావించింది మాగుంట రాఘవరెడ్డి తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు అని వివరించారు. శ్రీనివాసులు రెడ్డి వ్యవహారాన్ని కేసీఆర్‌కు అన్వయించి వార్తలు ప్రసారం చేయడం సరికాదని తెలిపారు. రాఘవరెడ్డి తండ్రి శ్రీనివాసులు రెడ్డి అంటూ ఈడీ చేసిన వాదనలను, కవిత తండ్రి కేసీఆర్‌ అని పేర్కొంటూ కొన్ని మీడియా సంస్థలు తప్పుగా కథనాలు ప్రసారం చేశాయన్నారు.

వాదనల సందర్భంగా ఈడీ మాగుంట రాఘవ వాంగ్మూలాన్ని ప్రస్తావించిందని వివరించారు. అందుకు సంబంధించిన వాంగ్మూల పత్రాన్ని ఆయన మీడియాకు చూపించారు. మాగుంట రాఘవ తన వాంగ్మూలంలో తన తండ్రి శ్రీనివాసులురెడ్డికి లిక్కర్‌ కేసులో ఉన్నవారిని పరిచయం చేశానని చెప్పారని మోహిత్‌ రావు వెల్లడించారు. కొందరు కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement