Thursday, April 25, 2024

కంటోన్మెంట్ వాసులకు కూడా ఉచితంగా తాగునీటి సరఫరా : మంత్రి త‌ల‌సాని

కంటోన్మెంట్ వాసులకు కూడా ఉచితంగా తాగునీటి సరఫరా కార్యక్రమం అమలు చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. బుధవారం సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో ఎమ్మెల్యే సాయన్నతో కలిసి వాటర్ వర్క్స్ అధికారులు, బోర్డు సీఈఓ అజిత్ రెడ్డిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల నీరు ఉచితంగా సరఫరా అమలులోకి వస్తుందన్నారు. దీని వలన ప్రతి నెల సుమారు కోటిన్నర రూపాయల ఆర్ధిక భారం ప్రభుత్వం పై పడుతున్నదని చెప్పారు. దేశంలో 62 కంటోన్మెంట్ బోర్డులు ఉండగా ఒక్క తెలంగాణలో మాత్రమే ముఖ్యమంత్రి ఆదేశాలతో అమలు ఉచిత నీటి సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కంటోన్మెంట్ ప్రజలు కూడా మా బిడ్డలే.. వారిని కన్నబిడ్డలుగా భావించి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం కాపాడుకుంటుందని చెప్పారు. కంటోన్మెంట్ ప్రాంతంలో సుమారు 4 లక్షల మంది జనాభా ఉందని, వారికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ క్రింద పేదింటి ఆడపడుచుల వివాహానికి ఆర్ధిక సహాయం, ఆసరా క్రింద వృద్దులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్ లు, పేదలకు ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను వర్తింపజేస్తున్న విష‌యాన్ని గుర్తుచేశారు. ఈ సమావేశంలో బేవ రేజెస్ కార్పోరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, వాటర్ వర్క్స్ ED సత్యనారాయణ, ENC కృష్ణ, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, సభ్యులు లోకనాధం, పాండు యాదవ్, నళినీ కిరణ్, అనిత ప్రభాకర్, భాగ్య శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement