Friday, April 26, 2024

అభిమాని పై కమల్ ట్వీట్…వజ్ర వరల్డ్ రికార్డు ఆమెకే !!

హీరోలపై ఫాన్స్ అభిమానం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డైహార్డ్ ఫ్యాన్స్ అయితే వేరే లెవెల్ లో ఉంటుంది. అయితే తమిళ స్టార్ నటుడు కమల్ హాసన్ అభిమాని ఆయనపై ఉన్న అభిమానం తో సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. అసలు విషయం ఏంటంటే కేరళలోని కోజికోడ్ కు చెందిన నేహా ఫాతిమా చుక్కలు గీతలు లేకుండా కేవలం కమలహాసన్ పేరును మాత్రమే రాస్తూ ఆయన పోర్ట్ రేట్ గీసింది.

లారెస్ట్ స్టెన్సిల్ వర్డ్ ఆర్ట్ విభాగంలో పెన్ పెన్సిల్ తో వైట్ చార్ట్ పై రెండు గంటల యాభై నిమిషాల్లో నేహా ఆ బొమ్మను వేయడం విశేషం. కాగా స్నేహ ఫాతిమా దీనితో వజ్ర వరల్డ్ రికార్డును అందుకుంది. ఇదే విషయాన్ని కమల్ హాసన్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement