Saturday, May 4, 2024

జూలై 31…మహేష్ ఫ్యాన్స్ రెడి గా ఉండండి

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారువారి పాట. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమా బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతోంది. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను ఈ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. జూలై 31వ తేదీన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. సూపర్ స్టార్ ఫస్ట్ నోటిస్ ఆన్ 31 జూలై అంటూ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అలాగే ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మరో అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement