Thursday, April 25, 2024

రూపాయికే పేదలకు ఇళ్లు ఇస్తే కడుపు మంటః మంత్రి బొత్స

పేదలకు కట్టిస్తున్న ఇళ్లపై టీడీపీ కావాలనే తప్పుడు విమర్శలు చేస్తోందని  రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఒక్క రూపాయికే పేదలకు తాము ఇళ్లు ఇస్తున్నామని… ఇది కొందరికి నచ్చడం లేదన్నారు. ఇళ్లు నిర్మించి పేదలకు అందించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని తెలిపారు. టిడ్కో ఇళ్లకు నిర్వహించిన రివర్స్ టెండరింగ్ లో రూ. 480 కోట్ల ప్రజాధనం పొదుపు అయిందని వెల్లడించారు. అయితే దీన్ని విపక్షాలు సహించలేకపోతున్నాయని విమర్శించారు.


టీడీపీ ప్రభుత్వ హయాంలో 4.54 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఉత్తర్వులు ఇచ్చి, కేవలం 51,616 ఇళ్ల నిర్మాణాన్ని మాత్రమే మొదలు పెట్టారని బొత్స తెలిపారు. ఆ ఇళ్లను నిర్మించిన ఒక్క చోట కూడా సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేవన్నారు. షీర్ వాల్ టెక్నాలజీ అంటూ పనులను హడావుడిగా మొదలు పెట్టి, మధ్యలోనే వదిలేశారని చెప్పారు. సీఎం జగన్ 28 లక్షల 30 వేల ఇళ్లు కట్టిస్తున్నారని అన్నారు. జగనన్న కాలనీల్లో 340 ఎస్‌ఎఫ్‌టీతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement