Thursday, May 2, 2024

Hanuman | ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.!

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజా సజ్జ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సూపర్‌‌హీరో మూవీ హనుమాన్. టాలీవుడ్ నుంచి రాబోతున్న మచ్ అవైటెడ్ సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. సినిమాపై కూడా మంచి హైప్ ఉంది. మూవీ నంచి రిలీజ్ అయిన పొస్టర్స్, సాంగ్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మూవీ అనౌన్సమెంట్‌తోనే హైప్ క్రియేట్ చేసిన మేకర్స్.. టీజర్‌‌తో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెంచేశారు. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌‌ని రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. హనుమాన్ మూవీ ట్రైలర్‌‌ని ఈ నెల (డిసెంబర్) 19న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు.

ఇక ఈ సినిమా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. నిజానికి హనుమాన్ సినిమా షూటింగ్ పూర్తి అయి నెలలు గడుస్తుంది. అంతా అనుకున్నట్టు జరిగితే, ఎప్పుడెప్పుడో వచ్చిన ఆదిపురుష్ కంటే ముందే హనుమాన్ మూవీ థియేటర్ లో విడుదల కావాల్సింది. కానీ, వీఎఫ్ఎక్స్ పనుల్లో ఆలస్యం కారణంగా వాయిదా పడుతూ వస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement