Saturday, April 27, 2024

తెలుగు భాష నేర్చుకుంటున్న ఫాహద్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా ‘పుష్ప’. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయబోతున్నారు. కనుక అన్ని భాషలకు ఆయా పాత్రల్లో నటించిన వారే డబ్బింగ్ చెప్పుకోవాలని సుకుమార్ సూచించినట్లుగా తెలుస్తోంది. పుష్ప’లో కీలక పాత్ర పోషించేవారు సొంత గొంతు వినిపించాల్సిందేనని దర్శకుడు సుకుమార్ సూచించినట్టు తెలుస్తోంది. ఇందులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్న అల్లు అర్జున్ సరసన నటిస్తోంది. ఫాహద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. దీంతో ఫాహద్ ఫాజిల్ తెలుగుపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. రష్మిక కూడా ఆ మధ్య తెలుగు భాష నేర్చుకునేందుకు కుస్తీ పడింది. రష్మిక, ఫాహద్ ఫాజిల్‌తో పాటు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్న నటీ, నటులు కూడా తమ పాత్రకు తామే డబ్బింగ్ చెప్పుకోనున్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement