Saturday, April 27, 2024

‘అఖండ’ రిలీజ్ పై క్లారిటీ మిస్ అవ్వట్లేదుగా !!

నందమూరి బాలకృష్ణ హీరోగా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమా అనుకున్న సమయం అంటే సెప్టెంబర్ నెలలోనే రిలీజ్ కాబోతోందట. తాజా సమాచారం ప్రకారం అఖండ వినాయక చవితి సందర్భంగా రిలీజ్ కు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇక ఫ్యాన్స్ కూడా ఈ సినిమా రిలీజ్ పై ఎటువంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement