Thursday, May 26, 2022

కొంప ముంచిన హరితహారం.. జెడ్పీ ఛైర్మన్‌కు కరోనా

తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ ఎత్తివేసినా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. మరోవైపు కరోనాతో మరణిస్తున్న వారి సంఖ్య కూడా అదుపు కావడం లేదు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. దీంతో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు, అధికారులు, పోలీసులు, వైద్యులు.. ఇలా అందరూ కరోనా బారిన పడుతున్నారు.

తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జెడ్పీ ఛైర్మన్, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య కరోనా బారిన పడ్డారు. కొన్నిరోజులుగా పినపాక నియోజకవర్గంలో మంత్రులతో పాటు కోరం కనకయ్య హరిత హారం కార్యక్రమంతో పాటు పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. దీంతో కరోనా అనుమానిత లక్షణాలు జ్వరం, జలుబు, దగ్గు ఉండటంతో కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా తనతో కాంటాక్ట్ అయినవారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరం కనకయ్య సూచించారు.

ఈ వార్త కూడా చదవండి: దేశంలో తగ్గిన కరోనా మరణాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement