Friday, April 19, 2024

విజయవాడలో స్పైస్ జెట్ సర్వీసులు షురూ

విజయవాడ విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమాన సర్వీసులు శుక్రవారం నుంచి పునఃప్రారంభమయ్యాయి. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో విజయవాడకు స్పైస్ జెట్ సర్వీసులు నిలిచిపోయాయి. అయితే, ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో తిరిగి ఇవాళ్టి నుంచి సర్వీసులు మొదలయ్యాయి. దాదాపు మూడు నెలల సుదీర్ఘ విరామం అనంతరం బెంగళూరు స్పైస్ జెట్ సర్వీస్ విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంది.

మరోవైపు విజయవాడ విమానాశ్రయం నుంచి 2 నెలలుగా ఆగిపోయిన అంతర్జాతీయ సర్వీసులు త్వరలో ప్రారంభంకానున్నాయి. ఈనెల 20 నుంచి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు మస్కట్‌కు విమాన సర్వీసు నడపనున్నారు. టికెట్లు బుక్‌ చేసుకునేందుకు ప్రయాణికులకు అనుమతి ఇచ్చారు. అంతర్జాతీయ సర్వీసులకు అనుగుణంగా విస్తరించిన రన్‌వేను ఇప్పటికే ప్రారంభించారు.

ఇది కూడా చదవండి: కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారు

Advertisement

తాజా వార్తలు

Advertisement