Sunday, April 28, 2024

Movie | రీ రిలీజ్ ట్రెండ్‌లో చిరంజీవి.. మరోసారి థియేటర్లలో సందడి చేయనున్న శంకర్ దాదా ఎంబీబీఎస్

టాలీవుడ్ లో కొన్నాళ్లుగా రీ-రిలీజ్ ట్రెండ్ కొన‌సాగుతూనే ఉంది.. స్టార్ హీరోల‌ దగ్గర్నుంచి చిన్న సినిమాల వరకు మరోసారి థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు అదే లిస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ హిట్ మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను రీ-రిలీజ్ చేస్తారంటూ గత ఆగస్ట్ నుంచి ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ సినిమాను వచ్చే నెల 4న థియేట‌ర్ల‌లో రీ-రిలీజ్ చేయ‌నున్న‌ట్టు అధికారికంగా ప్రకటించారు.

ఈ మూవీలో చిరు కామెడీ టైమింగ్ కు అభిమానులు ఫిదా అయ్యారు. అలాగే చిరు అనుచరుడిగా ఏటీఎం పాత్రలో శ్రీకాంత్ నటించి మెప్పించారు. దీంతో ఈ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్.. సాంగ్స్ ఇప్పటికీ యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement