Thursday, May 16, 2024

డ్రీమ్ గ‌ర్ల్2.. ఎనౌన్స్ చేసిన మేక‌ర్స్

రాజ్ శాండిల్య డైరెక్ట్ చేసిన మూవీ డ్రీమ్ గ‌ర్ల్.కాగా ఈ మూవీకి సీక్వెల్ వ‌స్తోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ ఓ వీడియోను ట్వీట్ చేశాడు బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా. డ్రీమ్ గర్ల్‌ 2 జులై 7న రావాల్సి ఉంది. కానీ కొత్త విడుదల తేదీని ఫిక్స్ చేస్తూ ఆగస్టు 25న రిలీజ్ చేస్తున్నట్టు తెలియజేశాడు. కామెడీ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో లైగర్ ఫేం అనన్యపాండే ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. పరేశ్‌ రావల్‌, అన్నూ కపూర్‌, విజయ్‌ రాజ్‌, రాజ్‌ పాల్ యాదవ్‌, సీమా పహ్వా, ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏక్తా కపూర్‌, శోభా కపూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత మీ సెల్‌ఫోన్‌ మళ్లీ రింగ్ అవుతుంది.. అంటూ డ్రీమ్‌ గర్ల్‌ వాయిస్ ఓవర్‌తో అందించిన రిలీజ్ అప్‌డేట్ ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో కరమ్‌వీర్‌ సింగ్‌గా.. పూజగా ఆయుష్మాన్‌ యాక్టింగ్‌ రెండు షేడ్స్‌లో ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement