Wednesday, May 19, 2021

స్వల్ప లక్షణాలతో ఇబ్బందిపడుతున్నా ….బన్నీ

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి విపరీతంగా ఉంది. సామాన్య ప్రజలతో పాటు సిని రాజకీయ ప్రముఖులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. అయితే ఇదే విషయాన్ని అల్లుఅర్జున్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం స్వల్ప లక్షణాలతో ఇబ్బంది పడుతున్నట్లు అల్లు అర్జున్ చెప్పారు. అలాగే క్వారంటైన్ లో ఉన్నానని మీ ఆప్యాయత అభిమానానికి ధన్యవాదాలు అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. నేను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని ట్వీట్ చేశారు బన్నీ. ఇక సినిమాల విషయానికొస్తే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పుష్ప రాజ్ గా నటించబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Prabha News