Saturday, April 27, 2024

కంగనా వివాదంలోకి అక్షయ్ కుమార్ పేరు

నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది బాలీవుడ్ హాట్ బ్యూటీ కంగనా రనౌత్. ఇటీవల కాలంలో సుశాంత్ మరణం తర్వాత డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి కూడా బాలీవుడ్ స్టార్స్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడటం స్టార్ట్ చేసింది. అయితే రీసెంట్ గా స్టార్ హీరో అక్షయ్ కుమార్ ని కూడా తన వివాదంలోకి లాగింది కంగనా రనౌత్.

జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న తలైవి సినిమాలో కంగన నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల అయింది. ఈ ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాగా బాలీవుడ్ పెద్దలు మాత్రం ఒక్కరు కూడా స్పందించలేదు. ఈ క్రమంలోనే తనకు కొన్ని సీక్రెట్ కాల్స్ వచ్చాయని సీక్రెట్ గా అభినందనలు తెలిపారని చెప్పుకొచ్చింది కంగన.

దీపిక, అలియా భట్ లాంటివారి సినిమాలకు పొగిడినట్టు పబ్లిక్ గా నన్ను పొగడరని చెప్పుకొచ్చింది. అక్షయ్ కుమార్ లాంటి పెద్ద స్టార్ కూడా ఈ మాఫియా కు భయపడి సీక్రెట్ గా అభినందనలు చెబుతున్నారని అలాంటిది… సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తుంది కంగన.

Advertisement

తాజా వార్తలు

Advertisement