Sunday, March 26, 2023

పామూరు ఎంపిటిసి బ్యాలెట్ సిపిఐ గుర్తులు తారుమారు..

ఒంగోలు – పామూరు రెండో ఎంపీటీసీ స్థానంలో గుర్తులు తారుమారయ్యాయి. బ్యాలెట్ పేపర్‌లో కంకి కొడవలి గుర్తు స్థానాన్ని మార్చడంపై సీపీఐ జిల్లా కార్య‌ద‌ర్శి నారాయ‌ణ అధికారుల‌తో వాగ్వాదానికి దిగారు.. దీంతో ఆయ‌న‌ను ఆరెస్ట్ చేసి పోలీస్ స్టేష‌న్ కు త‌రలించారు.. ఈ స్థానంలో రీపోలింగ్ నిర్వ‌హించాల‌ని సిపిఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ డిమాండ్ చేశారు..ప్ర‌స్తుతం ఈ స్థానంలో పోలింగ్ ప్ర‌శాంతంగా కొన‌సాగుతున్న‌ది..

Advertisement

తాజా వార్తలు

Advertisement