Sunday, May 12, 2024

‘హిట్-2’ ప్రీ లుక్ విడుదల

క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రూపొందిన “హిట్‌” చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందడమే కాకుండా బంపర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీతో విశ్వక్‌సేన్‌కు కూడా మంచి క్రేజ్‌ వచ్చింది. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ‘హిట్’కు సీక్వెల్‌‌గా ‘హిట్-2’తెరకెక్కుతోంది. ఈ మూవీలోని అడివి శేష్ ప్రీ లుక్‌ విడుదలైంది. ఈ మూవీ నిర్మాత నాని ఇవాళ ఈ లుక్‌ విడుదల చేశాడు. అడివి శేష్ ఇందులో కృష్ణ దాస్‌గా కన్పించనున్నాడు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించనుండగా కొత్త హీరోయిన్ కోమలి ప్రసాద్ ఓ ప్రధాన పాత్రలో కన్పించనుంది. కాగా హిట్‌-1 తెలంగాణ నేపథ్యంలో సాగగా.. హిట్‌-2 ఆంధ్రప్రదేశ్‌ నేపథ్యంలో సాగనుందట. త్వరలోనే ఈ మూవీ గురించి పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement