Monday, April 29, 2024

సాగర్ బరిలో జనసేన?

హైదరాబాద్‌, : తెలంగాణలో క్యాడర్‌ను బలోపేతం చేయడంపై జనసేనా ని దృష్టి కేంద్రీకరించారు. బీజేపీతో ఎలాంటి పొత్తులు లేకుండానే త్వరలో జరగనున్న ఖమ్మం, వరంగల్‌ కార్పొ రేషన్‌, నాగార్జునసాగర్‌ ఉపఎన్నికల బరిలో నిలిచేందుకు వ్యూహ రచనలు చేస్తున్నా రు. రాష్ట్ర వ్యాప్తంగా తమకున్న అభిమా నులను పార్టీలోకి ఆహ్వానించేందుకు పవన్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వెనకబడిన సామాజిక వర్గాలను ఆకట్టుకునే విధంగా పార్టీ భవిష్యత్‌ కార్యాచరణను రూపొందిస్తున్నట్లు ఆ పార్టీ వర్గీయులు తెలుపుతున్నారు. ‘తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసమే జనసేన పోరాటం’ అనే నినాదంతో తెలంగాణలో విస్తృతంగా జనసేన పార్టీని విస్తరించేందుకు జనసేన అధ్యక్షులు వ్యూహం పన్నుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఒంటరి పోరాటానికే సిద్ధం
తెలంగాణ నుంచే తమ ఉద్యమం మొదలవుతుందన్న జనసేన త్వరలో తెలంగాణలో జరగనున్న నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని బరిలో నిలిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. క్యాడర్‌ను అలర్ట్‌ చేయడానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీ నాగార్జునసాగర్‌ నియోజకవర్గ కమిటీలు వేయడం జరిగింది. ఉపఎన్నికలో పోటీచేయ డమా లేక.. ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వడమా..! అన్నది ఇంకా స్పష్టం లేదని ఆ పార్టీ వర్గీయులు తెలుపుతున్నారు. బీజేపీతో మాత్రం పొత్తుకు సముఖంగా లేమన్న విషయాన్ని స్పష్టంగా ఆ పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు.
ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్
ఎన్నికల్లో పోటీకి రెడీ
బీజేపీతో పొత్తులో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల నుంచి తప్పుకున్న జనసేన ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతుంది. ఆ ప్రాంతాల్లో కమిటీలు వేస్తూ.. క్యాడర్‌ను బలోపేతం చేసేందుకు పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు జనసేన వర్గాలు తెలుపుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement