Monday, July 22, 2024

TS : కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం

ఉదయం నుండి భానుడి ప్రతాపంతో వేడెక్కిన తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం సాయంత్రానికి రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షం కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో దట్టంగా మబ్బులు అలుముకున్నాయి. ఈ క్రమంలోనే కామారెడ్డిలో జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురుస్తోంది.

- Advertisement -

జిల్లా కేంద్రంలోని ఈవీఎం పంపిణీ కేంద్రం నుండి ఈవీఎంలను నియోజకవర్గాలకు తరలిస్తుండగా ఒక్కసారిగా భారీ వాన కురిసింది. దీంతో టెంట్లు, ఇతర ఎన్నికల సామాగ్రి తడిచిపోయాయి. డిస్ట్రిబుషన్ సమయంలో భారీ వర్షం కురవడంతో పోలింగ్ సిబ్బంది అవస్థలు పడుతున్నారు. పలువురు సిబ్బంది వర్షంలోనే తడుచుకుంటూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement