Monday, May 6, 2024

హ్యపీ బర్త్ డే నేచురల్ స్టార్ ‘నాని’

ఫిబ్రవరి 24 బుధవారం నేచురల్ స్టార్ హీరో నాని పుట్టినరోజు.  నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆయన కెరీర్ ప్రారంభమై నేచురల్ స్టార్ రేంజ్ వరకు ఆయన ఎదిగిన తీరు అద్భుతం..అమోఘం..అష్టాచమ్మా చిత్రంతో తెలుగు తెరపై హీరోగా మెరిశారు నాని. ఆ తరువాత ఆయన అంచలంచెలుగా ఎదుగుతూ ఈస్థాయికి చేరుకున్నారాయన. ఈ పుష్కరకాలంలో నాని ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించారు. ఒకప్పుడు నిర్మాతల కోసం ఎదురుచూసిన నాని ఈ రోజున తనే నిర్మాతగా మారిడం కూడా విశేషమే. ఏడాదికి మూడు సినిమాలైనా చేయాలనే ఒక నియమంతో ఆయన ముందుకు వెళుతుండటం చెప్పుకోదగ్గ విషయం.ఈ ఏడాది కూడా ‘టక్ జగదీశ్’ .. ‘శ్యామ్ సింగ రాయ్’ .. ‘అంటే .. సుందరానికీ!’ అనే సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. వైవిధ్యభరితమైన జోనర్లలో రూపొందుతున్న ఈ సినిమాలపై అందరిలోను ఆసక్తి ఉంది. నిరంతరం శ్రమించేవారి నుంచి సక్సెస్ తప్పించుకోలేదనడానికి నాని ఒక నిర్వచనంలా అనిపిస్తాడు .. నిదర్శనంగా కనిపిస్తాడు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నానీకి శుభాకాంక్షలు అందజేస్తూ ఆయన నుంచి మరిన్ని విభిన్నమైన .. విజయవంతమైన సినిమాలు రావాలని కోరుకుందాం. చిత్రపరిశ్రమలో ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చి .. తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్న అతికొద్దిమంది హీరోల్లో నాని ఒకరు. క్లాప్ బోర్డు పట్టుకుని సెట్లో తిరిగే ఓ కుర్రాడు ఈ రోజున క్లాప్స్ కొట్టించుకునే స్థాయికి చేరుకోవడం సాధారణమైన విషయమేం కాదు. దాని వెనుక ఆయన కృషి .. పట్టుదల .. కార్యదీక్ష ఉన్నాయి. ఇక్కడ తడబడకూడదు .. కష్టాలపై కలబడాలి .. నిలబడాలి. వెనకడుగు వేయకుండా వెన్ను తట్టుకుంటూ ముందుకువెళ్లాలి. ఆ పనిలో సక్సెస్ అయిన హీరోగా నాని కనిపిస్తాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement