Sunday, May 19, 2024

MI vs SRH | ఆఖర్లో ఆదుకున్న కమ్మిన్స్‌… ముంబయి టార్గెట్ ఎంతంటే

వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు తడబడ్డారు. విధ్వంసకర బ్యాటింగ్ లైనప్‌తో ఈ సీజన్‌లో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్న సన్‌రైజర్స్ ను తక్కువ పరుగులకే కట్టడి చేసే ప్రయత్నం చేసింది ముంబై జట్టు. అయితే, ఆఖర్లో కెప్టెన్ కమ్మిన్స్ చెలరేగడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులకే చేయగలిగింది.

ముంబైతో పోరులో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(48) బౌండరీల మోత మోగించాడు. అయితే, మిగిలిన బ్యాటర్లంతా విఫలమవ్వడంతో… వంద లోపే 5 కీల‌క వికెట్లు కోల్పోయి జట్టు క‌ష్టాల్లో ప‌డింది. అభిషేక్ శ‌ర్మ‌(11), మ‌యాంక్ అగ‌ర్వాల్ (5), నితీశ్ కుమార్(20), హెన్రిచ్ క్లాసెన్(2), మార్కో జాన్సెన్ (17), షాబాజ్ అహ్మద్ (10), అబ్దుల్ సమద్ (3)లు ఒక‌రి వెంట ఒక‌రు తక్కవ పరుగులకే పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. ఇక చివర్లో కెప్టెన్ కమ్మిన్స్ (35 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. దాంతో, జ‌ట్టుకు 173 పరుగులు భారీ స్కోర్ వచ్చింది.

ఇక ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా, హార్దిక్ పాండ్యా చెరో మూడు వికెట్లు తీయగా… జస్ప్రీత్ బుమ్రా, అన్షుల్ కాంబోజ్ తలో వికట్ దక్కించుకున్నారు. కాగా, 174 పరుగుల టార్గెట్‌తో ముంబై ఇండియన్స్ జట్టు ఛేజింగ్‌కు దిగనుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement