Sunday, May 19, 2024

HYD: ఎఫికాన్ కీటకనాశినితో భారతీయ రైతులకు నిబద్ధతను బిఎఎస్‌ఎఫ్‌ పునురుద్ఘాటిస్తోంది

హైదరాబాద్‌ గుచ్చి తిను, రసంపీల్చు పురుగులు భారతదేశంలోని వ్యవసాయ పంటలకు గణనీయంగా ముప్పు కలిగిస్తున్నాయి. పంట ఉత్పాదకతకు, దిగుబడికి ఇవి కలిగించే నష్టం 35 నుంచి 40శాతం ఉంటోంది. ఇవాళ ప్రారంభించబడిన బిఎఎస్‌ఎఫ్‌ కొత్త కీటకనాశిని ఎఫికాన్‌తో భారతీయ రైతులు ఈ ఇప్పుడు ఈ సవాలును అధిగమించవచ్చు. బిఎఎస్‌ఎఫ్‌ కొత్త క్రియాశీల పదార్థం ఆక్సాలియాన్‌తో ప్రత్యేక ఫార్ములేషన్‌లో ఎఫికాన్‌ శక్తివంతమైంది.

ఈసంద‌ర్భంగా ఆసియా పసిఫిక్ బిఎఎస్‌ఎఫ్‌ అగ్రికల్చరల్‌ సొల్యూషన్స్ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్ సిమోన్‌ బర్గ్ మాట్లాడుతూ… ఆసియా పసిఫిక్‌ వ్యూహానికి అనుగుణంగా, స్థానిక మార్కెట్‌ అవసరాల కోసం ప్రత్యేకంగా పరిష్కారాలను బిఎఎస్‌ఎఫ్‌ అభివృద్ధి చేస్తోందన్నారు. బిఎఎస్‌ఎఫ్‌లో తాము చేసే ప్రతి ఒక్కటి వ్యవసాయంపై ప్రేమతోనేన‌న్నారు. రైతుల అవసరాలను అర్థంచేసుకునేందుకు వాళ్ళు చెప్పేది వినడానికి, వాళ్ళతో కలిసి పనిచేసేందుకు తాము కట్టుబడ్డామన్నారు.

కాబట్టి భూమిపై అతిపెద్ద పని అయిన కీటకాల నుంచి పంటలను రక్షించడం, ఉత్పాదకతను పెంచడమే భారీ సవాలును విజయవంతంగా ఎదుర్కొనేందుకు సహాయపడటానికి తాము త‌మ నైపుణ్యాన్నివినియోగిస్తామన్నారు. బిఎఎస్‌ఎఫ్‌ అగ్రికల్చరల్‌ సొల్యూషన్స్ గ్లోబల్‌ స్ట్రాటజిక్‌ మార్కెటింగ్ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్ డా. మార్కో గ్రొజ్‌దానోవిక్ మాట్లాడుతూ… ఎఫికాన్‌ ఈ మైలురాయి ప్రపంచవ్యాప్తంగా రైతులకు సహాయపడే కీటకనాశిని పోర్టుఫోలియోను అభివృద్ధి చేయాలన్న త‌మ లక్ష్యానికి సపోర్టు చేస్తుందన్నారు. భారతీయ పరిశ్రమకు, వ్యవసాయానికి సహాయపడటానికి, వాళ్ళ సామర్థ్యాన్ని గరిష్టం చేసేందుకు బిఎఎస్‌ఎఫ్‌ కట్టుబడివుందన్నారు. రసంపీల్చు కీటకాల్లో నవీకరణలతో నిరోధకతను అదుపుచేస్తూ మెరుగైన దిగుబడులు సాధించేందుకు అధునాతన పరిష్కారాలకు ప్రవేశసౌలభ్యం కలిగివుండటానికి భారతీయ రైతులు అర్హులన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement