Sunday, May 19, 2024

AP | కవర్ల కొరత.. పోస్టల్ బ్యాలెట్ ఎలక్షన్ నిలిపివేత

ఆత్మకూరు, (ప్రభ న్యూస్) : పోస్టల్ బ్యాలెట్ ఎలక్షన్లో కవర్లు లేకపోవడంతో గందరగోళం ఏర్పడింది. మండల పరిధిలోని కరివేన గ్రామంలో ఉన్న డీ పౌల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఎలక్షన్‌లో.. ఒకే కవర్లో రెండు ఓట్లను వేయించింది ఎన్నికల సిబ్బంది. దీంతో ఉపాధ్యాయులు మా ఓట్లు చెల్లకుండా పోతాయని ఒకే కవర్లో రెండు కాకుండా ఒక్కొక్కటి వేరువేరుగా వేయించాలని పట్టుపట్టారు.

దీంతో రెండు గంటల పాటు డిపోల్ హైస్కూల్లో గందరగోళం ఏర్పడింది. తమ ఓట్లను చెల్లకుండా చేసేందుకే ఎన్నికల సిబ్బంది ఒకే కవర్లో రెండు ఓట్లను వేయిస్తున్నారని మండిపడ్డారు. దీంతో చివరికి కవర్ల కోసం శ్రీశైలం ఆర్వో సుధారాణి తాత్కాలికంగా పోస్టల్ బ్యాలెట్ ఎలక్షన్ ను వాయిదా వేశారు. అయితే ఉపాధ్యాయులు మాత్రం కవర్లు లేకపోవడం ఏంటని, కావాలనే ప్రభుత్వం ఇలా చేస్తుందని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement