Sunday, May 19, 2024

TS | పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…

ఎక్స్‌ప్రెస్ నెలవారీ సీజన్ టిక్కెట్ పాస్ హోల్డర్లకు టీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది. ఈ పాస్‌ కలిగి ఉన్న వారు డీలక్స్‌ బస్సుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును టీఎస్ఆర్టీసీ కల్పించింది. ఇప్పటి వరకు ఈ పాస్ ఉన్నవారు ఎక్స్ ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ప్రయాణించడానికి వీలుండేది. తాజాగా, డీలక్స్ బస్సుల్లో కూడా ప్రయాణించే సౌకర్యాన్ని టీఎస్ఆర్టీసీ కల్పించింది. రూ.20 కాంబినేషన్ టికెట్ తీసుకుని డీలక్స్ బస్సుల్లో ప్రయాణించవచ్చు.

ఎక్స్ ప్రెస్ ప్రయాణీకులకు మాత్రమే ఈ సౌకర్యం వర్తిస్తుందని టీస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్‌లో తెలిపారు. 100 కిలోమీటర్ల పరిధిలో జారీ చేసే ఈ పాస్‌ కావాలనుకునే వారు టీఎస్‌ఆర్టీసీకి చెందిన స్థానిక బస్‌ పాస్‌ కౌంటర్లను సంప్రదించగలరు అని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement