Tuesday, May 28, 2024

AP : చెరువులో ముగ్గురు మహిళల మృతదేహాలు

క‌ర్నూల్‌లో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ముగ్గురు మహిళల మృతదేహాలు వెలుగు చూశాయి. కర్నూలు(మ) గార్గేయపురం చెరువులో గుర్తు తెలియని ముగ్గురు మహిళల మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. ముందుగా ఒకే ప్రాంతంలో రెండు మృత దేహాలు గుర్తించారు పోలీసులు.

వెలికి తరలిస్తుండగా చెరువుకు అవతలి ఒడ్డున మరో మహిళ గుర్తించారు. మహిళలపై ఎలాంటి గాయాలు కనిపించలేదు.

ముగ్గురు మహిళలు ఆత్మహత్య చేసుకున్నారా…ప్రమాదవశాత్తు పడిపోయారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement