Saturday, May 4, 2024

‘శనయాకపూర్’ బ్రీత్ లెస్ బెల్లీ డ్యాన్స్

బెల్లీ డ్యాన్స్ తో అదరగొట్టేసింది శనయాకపూర్. బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్‌కపూర్‌, మహీకపూర్‌ దంపతుల ముద్దుల కూతురు శనయా కపూర్‌ త్వరలో వెండితెర అరంగేట్రం చేయబోతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో క్రమం తప్పకుండా హాట్‌ ఫొటోలు పోస్టు చేసే శనయా తాజాగా బెల్లీ డ్యాన్స్‌తో అదరగొట్టింది. హాలీవుడ్‌ పాప్‌సింగర్‌ షకీరా పాటకు స్టెప్పులేసింది. దాదాపు నిమిషం పాటు ఊపిరి తీసుకోకుండా డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. శనయా ట్యాలెంట్‌కు సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు.  సినిమాల్లోకి రాకముందే పలువురు స్టార్ వారసులు బోలెడంత పాపులారిటీ సంపాదించేసుకుంటున్నారు. అందుకోసం సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. స్టార్ వారసురాళ్లు తమ హాట్ హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్‌ను సంపాదించుకుంటున్నారు. హాట్ ఫొటోలతోపాటు మరికొందరు తమ స్పెషల్ ట్యాలెంట్లను కూడా ఫ్యాన్స్‌కు పరిచయం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement