Sunday, May 12, 2024

బాలయ్య చిత్రానికి ‘గాడ్ ఫాదర్’ టైటిల్ ఫిక్సా

దర్శకుడు బోయపాటి..హీరో బాలకృష్ణల కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతోంది.  బీబీ3 అనే టైటిల్‌తో ప్ర‌చారం జ‌రుపుకుంటున్న ఈ సినిమాలో బాల‌య్య అఘోరా క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ చిత్రానికి మోనార్క్ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ మూవీకి గాడ్ ఫాద‌ర్  అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తుంది. బాల‌య్య ఇమేజ్‌కు, క‌థ‌కు గాడ్ ఫాద‌ర్ అనే టైటిల్ అయితేనే స‌రిగ్గా సరిపోతుంద‌ని భావించిన మేక‌ర్స్ ఈ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న మ‌రి కొద్ది రోజుల‌లో రానుంది. రవీందర్ రెడ్డి నిర్మాణంలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి వ‌ర‌కు చిత్రానికి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్, వీడియోలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.  మే 28న ఈ సినిమా విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement