Friday, July 26, 2024

TS | సైలెన్స్ పీరియడ్‌లో ప్రచారం.. కాంగ్రెస్ పార్టీపై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు….

కాంగ్రెస్ పార్టీపై బీఆర్‌‌ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణలో శనివారం సాయంత్రం 6 గంటలకే ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. అయితే గడువు పూర్తయిన తరువాత సైతం కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీపై సీఈవో వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేశారు.

సోమవారం (మే 13న) ఉదయం పోలింగ్ ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో సైతం కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. 48 గంటల సైలెన్స్ పీరియడ్ లో ఎలాంటి ప్రచారం నిర్వహించరాదు అనే ఎలక్షన్ కమిషన్ నిబంధనల్ని కాంగ్రెస్ పార్టీ ఉల్లంఘించినట్లు తమ ఫిర్యాదులో బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు.

టీపీసీసీ సైతం సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేస్తోందని అందుకు తగిన ఆధారాలను సమర్పించారు. ఈసీ ఇచ్చిన గడువు ముగిసినా ప్రచారం చేయడంపై చర్యలు తీసుకోవాలని ఈసీతోపాటు తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement