Saturday, May 4, 2024

‘సలార్’ కోసం 100మంది కొత్త వారు

సలార్ సినిమా కోసం నిర్వహించిన ఆడిషన్స్ లో వందమంది కొత్త వారిని ఎంపిక చేశారు.  స్టార్ హీరో ప్ర‌భాస్ న‌టిస్తోన్న కొత్త ప్రాజెక్టు స‌లార్. కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్రంలో శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. స‌లార్ కోసం ఇప్ప‌టికే ప్ర‌శాంత్ నీల్ అండ్ టీం కొత్త న‌టుల‌కు ఆడిష‌న్స్ నిర్వ‌హించారు. హైద‌రాబాద్‌, చెన్నైలో ఆడిష‌న్స్ నిర్వ‌హించి 100 మంది కొత్త‌వారిని ఎంపిక చేశారు. హై బ‌డ్జెట్ యాక్ష‌న్ ఫిల్మ్‌గా ప్ర‌భాస్ ఈ చిత్రంలో మెకానిక్ పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా..కొత్త న‌టులంతా స‌లార్‌లో ప్ర‌భాస్‌తో క‌లిసి న‌టించ‌నున్నారు.ఇపుడీ వార్త టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ చిత్రంలో క‌న్న‌డ యాక్ట‌ర్ మ‌ధు గురుస్వామి విల‌న్‌గా న‌టిస్తున్నాడు. స‌లార్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం కాబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement