Saturday, May 25, 2024

వినూత్నంగా ‘జాతిరత్నాలు’ ప్రమోషన్స్

YouTube video

జాతిరత్నాలు చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు నవీన్ పోలిశెట్టి..ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్  నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది.. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.  స్వప్న సినిమా పతాకంపై అనుదీప్ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని మార్చి 11న వరల్డ్ వైడ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌, అందులో నవీన్‌, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ గెటప్‌, టీజర్‌, సాంగ్‌ అన్నీ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్‌ చేశాయి. ఇప్పటికే అందరిలో సినిమాపై మంచి ఆసక్తి ఏర్పడింది. స్వప్న సినిమా‌ బ్యానర్‌పై నాగ్‌ అశ్విన్‌ నిర్మిస్తోన్న చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. సోషల్ మీడియాలో సంచలనం క్రియేట్ చేస్తోన్న ఈ సినిమా ప్రమోషన్స్ ను యూనిట్ మరింత డిఫరెంట్‌గానే ప్లాన్‌ చేసింది. రెగ్యులర్‌కు భిన్నంగా యూనిట్‌ ఎప్పుడో ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేసేసింది. హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా ‘జాతిరత్నాలు’ సినిమా ప్రమోషన్స్‌లో చురుకుగా పాల్గొంటుంది. విడుదలకు రెండు, మూడు రోజుల ముందు ప్రమోషన్స్‌లో హీరో,హీరోయిన్లు పాల్గొంటారు. కానీ ఫరియా అబ్దుల్లా ముందుగానే ప్రమోషన్స్‌లో భాగమైంది. తమ సినిమా టైటిల్‌ ‘జాతిరత్నాలు’ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వినూత్నంగా ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేసింది ఫరియా అబ్దులా. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ.. జాతిరత్నాలు పేరున్న మాస్కులను ప్రేక్షకులకు అందిస్తూ వారితో తమ సినిమా పేరుని చెప్పించడం, తమ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చెప్పించేలా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌ చల్‌ చేస్తుం

Advertisement

తాజా వార్తలు

Advertisement