Friday, May 31, 2024

AP: క‌ర్నూలు జిల్లాలో భారీ వర్షం.. గోనెగండ్ల‌లో 4.4 సెం.మీ.ల వర్షపాతం నమోదు

గోనెగండ్ల: మే 25 ( ప్రభ న్యూస్ ) గోనెగండ్ల మండలంలో మెరుపులు, ఉరుములతో కూడిన భారీవర్షం కురిసింది. సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు భారీ ఉరుములు మెరుపులతో ఈదుర గాలులతో భారీ వర్షం పడింది. మండలంలో 4.4 సెంటీమీటర్ల వర్షం పాతం నమోదయింది. ఈ భారీ ఈదురగాలులకు పెద్దపెద్ద చెట్లు వేర్లతో సహా నేలకొరిగాయి.

అంతేకాక మండలంలో హెచ్ కెరవాడీ పుట్టపాశం, వేముగోడు గంజహళ్లి, గ్రామాల్లో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరకడంతో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో ఆయా గ్రామాలలో విద్యుత్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మండలంలో 150 విద్యుత్ స్తంభాలు, 40 విద్యుత్ ట్రాన్స్ ఫార్మ‌ర్లు నేలకోరిగి విద్యుత్ శాఖకు దాదాపు 30 నుంచి 40 లక్షల నష్టం వాటిల్లినట్లు ఏఈ సుధాకర్ రావు తెలిపారు. వేమగోడు, పుట్టపాశం గ్రామాల మధ్యలో ఎమ్మిగనూరు కర్నూలుకు వెళ్లే ప్రధాన రహదారికి అడ్డంగా విద్యుత్ స్తంభాలు,చెట్లుu నేలకొరిగి పడటంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. రోడ్డుకు అడ్డంగా పడ్డ చెట్లను, విద్యుత్ స్తంభాలను విద్యుత్ శాఖ అధికారులు జెసిబిలితో తొలగించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement