Monday, June 10, 2024

IPL 2024 | ట్రోఫీతో ఫైన‌ల్స్ జ‌ట్ట‌ కెప్టెన్ల సందడి..

క్రికెట్ ప్రేమికులను విశేషంగా అలరిస్తున్న ఐపీఎల్ 2024 సీజన్ చివరి దశకు చేరుకుంది. రేపు (మే 26) చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఐపీఎల్ సీజన్ 17 చివరి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ – కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఐపీఎల్ కప్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ఐపీఎల్ ట్రోఫీతో ఇరు జట్ల కెప్టెన్లు ఫొటోలు దిగారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ – కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ చెన్నై బీచ్, ఇతర ప్రాతాంల్లో ఐపీఎల్ కప్‌తో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఐపీఎల్ నిర్వాహకులు సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఇప్పుడు అవి వైరల్‌గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement