Saturday, June 22, 2024

Andhra Pradesh సిఎస్ భూకబ్జా….. ఆరోపించిన జ‌న‌సేన నేత మూర్తి యాద‌వ్ …

విశాఖ: రాష్ట్రంలో ఎన్నికల హింసపై విచారణ జరుగుతుంటే సీఎస్‌ విశాఖలో భూ అక్రమాలకు పాల్పడుతున్నారని జనసేన నేత పీతల మూర్తియాదవ్‌ ఆరోపించారు.. నాలుగు రోజుల క్రితం భూముల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చి భోగాపురం ఎయిర్‌పోర్టుపై సమీక్ష అని చెప్పారన్నారు. విశాఖ‌లో మూర్తి మీడియాతో మాట్లాడుతూ,

”నెల రోజుల్లో పదవీ విరమణ చేయనున్న సీఎస్‌ జవహర్‌రెడ్డి భారీగా భూఅక్రమాలకు తెరలేపారు. ఉత్తరాంధ్రలో రూ.2 వేల కోట్ల విలువైన అసైన్డ్‌ భూములను కొట్టేశారు. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యాకే భూముల మార్పిడి జీవో 596 ఇచ్చారు. ఆ జీవో ఆధారంగానే సీఎస్‌ కుమారుడు విశాఖలో 800 ఎకరాలకు పైగా భూములు చేజిక్కించుకున్నారు. 400 ఎకరాల ఎస్సీ, బీసీ అసైన్డ్‌ భూములను బినామీల పేరిట సొంతం చేసుకున్నారు. విశాఖ, విజయనగరం జిల్లాల్లోని అసైన్డ్‌ భూములపై కన్నేసి కుమారుడిని రంగంలోకి దింపారు. ఎకరం రూ.2 కోట్లు పలికే భూములను ఐదారు లక్షలకే జవహర్‌రెడ్డి ముఠా ఒప్పందాలు చేసుకుంది. వైకాపా ప్రభుత్వం మళ్లీ రాదన్న భయంతో హడావుడి రిజిస్ట్రేషన్లకు సిద్ధమయ్యారు. ఈసీ జోక్యం చేసుకొని అక్రమ భూరిజిస్ట్రేషన్లు నిలిపివేయాలి. రాష్ట్రవ్యాప్తంగా మార్చి నుంచి జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలి. అసైన్డ్‌ భూములు కొట్టేసిన వైసిపి నేతలు, ఐఏఎస్‌లపై సీబీఐ విచారించాలి” అని మూర్తి యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement