Saturday, June 15, 2024

Amisha Patel : అన్ లిమిటెడ్ షో….

బ‌ద్రి , కహో నా ప్యార్ హై, గదర్: ఏక్ ప్రేమ్ కథా వంటి హిట్ చిత్రాలలో తన అద్భుత న‌ట‌న‌తో పాపుల‌రైన బాలీవుడ్ నటి అమీషా పటేల్ మరోసారి హెడ్ లైన్స్ లోకొచ్చింది. ఈసారి తన అద్భుతమైన ఫోటోషూట్ అంత‌ర్జాలంలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలి సోషల్ మీడియా పోస్ట్‌లో అమీషా చెకర్డ్ బికినీలో ఉన్న త‌న‌ అద్భుతమైన ఫోటోల‌ను షేర్ చేసింది.

48 ఏళ్ల వయస్సులో కూడా ఇంత ఫిట్‌గా, టోన్డ్ ఫిజిక్‌ని మెయింటైన్ చేసినందుకు అభిమానులు అమీషాను ప్రశంసిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ ప‌రిస‌రాల్లో తీసిన ఫోటోలు, బికినీతో చెల‌రేగుతున్న‌వి.. జుట్టు స్వేచ్ఛగా వ‌దిలేసి హావ‌భావాలు ప‌లికించ‌డం వ‌గైరా చాలా విషయాలున్నాయి. దీనికి ‘వేసవి కాలం’ అని క్యాప్షన్ ఇచ్చింది. అమీషా పటేల్ పింక్ కలర్ గ్లామ్ మేకప్ లుక్ లో అద‌ర‌గొట్టింది. అమీషా పటేల్ బికినీ ఫోటోలు సోషల్ మీడియా లలో వేగంగా వైరల్ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement