Saturday, June 15, 2024

Counter – జూపల్లి వ‌ల్లే ఫ్యాక్షన్ ప‌డ‌గ‌ – ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు

మంత్రి జూపల్లి కృష్ణారావు అండదండలతో కొల్లాపూర్ నియోజకవర్గంలో ఫ్యాక్ష‌న్ ప‌డ‌గ‌లెత్తుతుంద‌ని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ భవన్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జూపల్లి బీఆర్ ఎస్‌ నేత శ్రీధర్ రెడ్డిని హత్య చేయించాడని మృతుడి తల్లి దండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. ఎఫ్ఐఆర్‌ లో ఎందుకు నమోదు చేయ‌లేదని, ఇంత వరకు నిందితులను అరెస్ట్ చేయలేదని సీరియస్ అయ్యారు.

హ‌త్య‌లు జ‌రుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఫ్యాక్షన్ నడపడం జూపల్లి కి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. బుడోజర్ల సంస్కృతిని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన వ్యక్తి మంత్రి అని ఆరోపించారు. నిందితులకి స్టేషన్ బెయిల్ ఇప్పిస్తున్నారని.. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలేదని ఫేక్ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. శ్రీధర్ రెడ్డి కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు. ఫ్యాక్షన్ సంస్కృతిని పారదోలాలంటే వెంటనే కొల్లాపూర్ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో పికెటింగ్ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పాలమూరులో కేసీఆర్ నీళ్లు పారిస్తే, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి రక్తపుటేరులు పారిస్తున్నారన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement