Monday, June 17, 2024

Sixth Phase Polling – ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్


58 స్థానాలకు 889 మంది అభ్య‌ర్థుల‌ పోటీ
మొత్తం 11.13 కోట్ల మంది ఓటర్లు
ఓడిశాలోని 42 స్థానాల‌కూ పోలింగ్
ప‌లు చోట్ల ఈవీఎంల మొరాయింపు
అద‌న‌పు స‌మ‌యం కేటాయించిన ఈసీ

లోక్ సభ ఎన్నికలు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకూ 5 విడతల్లో లోక్ సభ ఎన్నికలు జరుగగా.. శ‌నివారం ఆరో దశ పోలింగ్ కూడా ప్ర‌శాంతంగా ముగిసింది.. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం వరకూ కొన‌సాగుతున్న‌ది. ఈ ద‌శ‌లో మొత్తం 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ జ‌రిగింది. హర్యానా 10, బీహార్ 8, జమ్ము కశ్మీర్ 1, ఝార్ఖండ్ 4, ఢిల్లీ 7, ఉత్తరప్రదేశ్ 14, ఒడిశా 6, పశ్చిమ బెంగాల్ లో 8 స్థానాలు ఆరో విడత ఎన్నికల పోలింగ్ లో ఉన్నాయి

- Advertisement -

58 స్థానాలు.. 11.13 కోట్ల మంది ఓట‌ర్లు.

58 నియోజకవర్గాల్లో 889 మంది అభ్యర్థులు పోటీ బరిలో ఉన్నారు. 5.84 కోట్ల మంది పురుష ఓటర్లు, 5.29 కోట్ల మహిళా ఓటర్లు ఉన్నారు. అలాగే 5,120 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. మొత్తం 11.13 కోట్ల మంది ఓటర్లు ఆరోదశ ఎన్నికల్లో ఓట‌ర్లుగా ఉన్నాయి..అలాగే ఈ ద‌శ‌లో ఒడిశాలో లోక్ సభ ఎన్నికలతో పాటు.. 42 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు హక్కుతో తమ నాయకుడిని ఎన్నుకునేందుకు 7 గంటల నుంచే పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరారు.

ల‌క్షా 14 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు

ఆరోదశ ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ లక్ష 14 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకుంది. ఆయా పోలింగ్ బూత్ ల వద్దకు 11.4 లక్షల మంది అధికారులను పంపింది. పోలింగ్ నేపథ్యంలో.. ఢిల్లీ, ఫరీదాబాద్, గురుగ్రామ్ సహా అన్ని పోలింగ్ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూతపడ‌డ్డారు.

పోటీలో ఉన్న ప్ర‌ముఖులు

ఆరోదశ ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారిలో మనోహర్ లాల్ ఖట్టర్ (బీజేపీ): కర్నాల్, హర్యానా, బాన్సూరి స్వరాజ్ (బీజేపీ): న్యూఢిల్లీ, మనోజ్ తివారీ (బిజెపి) కన్హయ్య కుమార్ (కాంగ్రెస్): ఈశాన్య ఢిల్లీ, మేనకా గాంధీ (బీజేపీ): సుల్తాన్‌పూర్, ఉత్తరప్రదేశ్, దినేష్ లాల్ యాదవ్ (బిజెపి), ధర్మేంద్ర యాదవ్ (ఎస్పీ): అజంగఢ్, ఉత్తరప్రదేశ్, సంబిత్ పాత్ర (బిజెపి): పూరి, ఒడిశా ; నవీన్ జిందాల్ (బీజేపీ): కురుక్షేత్ర, హర్యానా ; రాజ్ బబ్బర్ (కాంగ్రెస్) రావ్, ఇంద్రజిత్ సింగ్ (బిజెపి): గుర్గావ్, హర్యానా ; అభిజిత్ గంగోపాధ్యాయ (బిజెపి): తమ్లుక్ సీటు, పశ్చిమ బెంగాల్ ఉన్నారు. దేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలుండగా.. ఆరోదశతో 486 సీట్లకు పోలింగ్ పూర్తవుతుంది. ఢిల్లీ 7 లోక్ సభ స్థానాలు ఉండగా.. అన్ని స్థానాల్లోనూ ప్రధాన పోటీ బీజేపీ – ఆప్ ల మధ్య జరగుతుంది. ఏడుకు ఏడు సీట్లు కైవసం చేసుకుంటామని అటు కేజ్రీవాల్, ఇటు మోదీ ధీమాతో ఉన్నారు..

మొరాయించిన ఈవిఎంలు

ఆరో దశ లోక్‌సభ ఎన్నికల్లో రాజధాని ఢిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్‌, జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌-రాజౌరీ, ఒడిశాలోని పూరీ సీటుకు సంబంధించిన అన్ని స్థానాల్లో ఓటింగ్ సమయంలో ఈవీఎంలు మొరాయించాయి. ఢిల్లీలోని చాందినీ చౌక్‌లోని ఢిల్లీ గేట్‌లో కూడా ఈవీఎం పనిచేయకపోవడంపై సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈవీఎంలు పనిచేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత రెండు గంటలుగా ప్రజలు క్యూలో నిలబడి ఓటు వేశారు.

ఒడిశాలోనూ
ఒడిశాలోని పూరీ లోక్‌సభ స్థానంలో ప‌లు పోలింగ్ కేంద్రాల‌లో ఈవిఎంలు ప‌ని చేయ‌డం లేద‌ని అక్క‌డిచి బీజేపీ అభ్యర్థి సంబిత్ పాత్ర ఎన్నిక‌ల అధికారుల‌కు ఫిర్యాదు చేశారు.. యంత్రం పనిచేయకపోవడంతో చాలా మంది ఓటు వేయకుండానే వెనుదిరిగారని, పోలింగ్ సమయం పొడిగించాలని కోరారు. దీనికి స్పందించిన అధికారులు పోలింగ్ స‌మ‌యాన్ని ఇక్క‌డ ఓ గంట పొడిగించారు.

జమ్మూకశ్మీర్‌లో సేమ్ సీన్

మరోవైపు, జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ స్థానానికి చెందిన పీడీపీ అభ్యర్థి మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ, చాలా చోట్ల యంత్రాలు ట్యాంపరింగ్ అవుతున్నాయని, యంత్రాలు పనిచేయడం లేదని ఆరోపించారు. అంతే కాకుండా మెహబూబా ముఫ్తీ పోలింగ్ కేంద్ర వ‌ద్ద ధ‌ర్నాకు దిగారు… పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి అమెను అక్క‌డి నుంచి త‌ర‌లించారు.. పోలింగ్ నిలిచిన చోట అద‌న‌పు స‌మ‌యం ఇస్తామ‌ని ఎన్నిక అధికారులు చెప్పారు.

ఢిల్లీలో మంద‌కొడిగా పోలింగ్ ..
రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటింగ్ నిదానంగా సాగింద‌ని తొలి గంట‌లో ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి… ఓటింగ్‌ సజావుగా జరిగేలా ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలని సీఎం కేజ్రీవాల్ కోరారు. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్‌ నెమ్మదిగా సాగుతుందని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత అతిషి అన్నారు. చాందినీ చౌక్‌లోని ఢిల్లీ గేట్ ప్రాంతం ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతం. ఇక్కడ పోలింగ్ బూత్ వద్ద భారీ క్యూ ఉంద‌ని.. గత 2 గంటలుగా ఈవీఎం పనిచేయలేద‌ని ఎన్నిక‌ల సంఘం దృష్టికి తీసుకెళ్లారు అతిషి. దీంతో ఎన్నిక‌ల సాంకేతిక సిబ్బంది రంగ ప్ర‌వేశం చేసి ఈవిఎంల‌ను సుజావుగా ప‌ని చేసేలా చ‌ర్య‌లు తీసుకున్నారు.

బెంగాల్‌లోని ఈవీఎంలలో బీజేపీ ట్యాగ్‌లు
పశ్చిమ బెంగాల్‌లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఓట్లను చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఈరోజు బంకురాలోని రఘునాథ్‌పూర్‌లో 5 ఈవీఎంలపై బీజేపీ ట్యాగ్‌ కనిపించిందని ఆ పార్టీ పేర్కొంది. దీనిపై వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు సూచించారు.

ఉత్తరప్రదేశ్‌లోనూ ఈవీఎంల సమస్య
ఉత్తరప్రదేశ్‌లోని సిట్టింగ్ ఎంపీ, సుల్తాన్‌పూర్ బీజేపీ అభ్యర్థి మేనకా గాంధీ మాట్లాడుతూ, “2-3 చోట్ల ఈవీఎంలలో సమస్యలు ఉన్నాయి, 2-3 చోట్ల చిన్న సమస్యలు ఉన్నాయి, కొంతమంది అధికారులు శిక్షణ పొందలేదు.. కొందరు మా ఏజెంట్లకు తెలియదు.

ఎన్నికల సంఘం ఏం చెప్పింది
ఆరో దశ లోక్‌సభ ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల నుంచి ఈవీఎం పనిచేయకపోవడం, ట్యాంపరింగ్‌ జరిగిందన్న వార్తలపై ఎన్నికల సంఘం ప్రతి ఫిర్యాదును పరిశీలిస్తుందని, సరైన విచారణ తర్వాతే తేలిన ఫలితాల ఆధారంగా సమాధానం ఇస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement