Tuesday, May 14, 2024

మేనల్లుడికి చిరు ఖరీదైన బహుమతి

ఉప్పెన సినిమా మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మంచి హిట్ ని అందుకున్నాడు. ఫస్ట్ చిత్రంతోనే సూపర్ హిట్ ను అందుకోవటంతో పాటు వంద కోట్ల కలెక్షన్ కూడా రాబట్టాడు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.

మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్ కు మెగాస్టార్ చిరంజీవి ఓ బహుమతిని అందించారు. తన ప్రతిభకు మెచ్చి ఖరీదైన వాచ్ ను మెగాస్టార్ అందించారు. వైష్ణవ్ ను ప్రత్యేకంగా ఇంటికి పిలిపించి మరీ ఈ బహుమతి ఇచ్చారట. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ చిరు తో దిగిన ఫోటో ని పోస్ట్ చేశారు వైష్ణవ్ తేజ్.

https://twitter.com/VaishnavTejOffl/status/1369624015585775622?s=19
Advertisement

తాజా వార్తలు

Advertisement