Sunday, May 5, 2024

రుణ యాప్ కేసులో కీల‌క నిందితుడు అరెస్ట్…

హైదరాబాద్‌ : రుణ యాప్‌ల కేసులో ఏపీలోని చిత్తూరుకు చెందిన రాజశేఖర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బెంగళూరులో అత‌డిని అరెస్టు చేశారు. 9 కంపెనీలకు డైరెక్టర్‌గా ఉండి పలు రుణ యాప్‌ల సంస్థలతో రాజ‌శేఖ‌ర్ ఒప్పందం చేసుకున్నట్లు గుర్తించారు. స్నాప్‌ఇట్‌, ఓకేక్యాష్‌, మైబ్యాంకు, క్యాష్‌డి, రూపేఫ్యాక్టరీ, బబుల్‌లోన్‌ వంటి రుణ యాప్‌లతో ఒప్పందం చేసుకున్నాడు. ఈ అరెస్ట్ తో పోలీసులు ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య‌ 21 చేరింది.. అలాగే రూ.300 కోట్లు సీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement