Thursday, April 25, 2024

స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణపై పెరుగుతున్న ఆందోళనలు

విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణపై ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఉక్కు ఉద్యోగులు తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సమ్మె నోటీసులు ఇచ్చింది. ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, సీతమ్మధార భూముల విక్రయ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని, పోస్కో కంపెనీతో జరిగిన ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సమ్మె నోటీసును విశాఖ స్టీల్ సీఎండీకి ఇచ్చారు. 14 రోజుల తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని నోటీసులో పేర్కొన్నారు. ఇక ఆర్-కార్డు ఉన్న వారందరికీ శాశ్వత ఉపాధిని కల్పించాలని డిమాండ్ చేశారు. మరోవైపు, ఈనెల 17న అఖిలపక్ష సంఘాలతో నిరాహార దీక్ష, మార్చి 20న క్రిష్ణా గ్రౌండ్స్ లో బహిరంగ సభకు కార్మిక సంఘాలు సిద్ధం అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement