Saturday, May 18, 2024

TS: నిర్మల్ లో రాహుల్ గాంధీ పర్యటన

రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి మే 10వ తేదీ వరకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇవాళ ఉదయం నాంధేడ్‌ నుంచి నేరుగా నిర్మల్ లో జరగనున్న ఎన్నికల ప్రచార సభకు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు.

- Advertisement -

అక్కడ అదిలాబాద్‌ అభ్యర్ధి ఆత్రం సుగుణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఆ తరువాత అక్కడి నుంచి నాగర్‌ కర్నూల్‌ పార్లమెంటు నియోజక వర్గం పరిధిలోని అలంపూర్‌ ఎర్రవల్లి కూడలి వద్ద జరగనున్న ఎన్నికల ప్రచార సభకు సాయంత్రం 5 గంటలకు హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. తిరిగి ఈ నెల 9న ఉదయం కరీంనగర్, సాయంత్రం 5 గంటలకు సరూర్ నగర్‌లో రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారం చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement