Saturday, June 1, 2024

AP | బాంబు దాడుల‌పై ఈసీ సీరియ‌స్.. బాటిళ్ల‌లో ఇక పెట్రోల్‌కు నో

ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పలు హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప‌లు చోట్ల పెట్రోల్‌ బాంబులతో దాడులు చేసుకున్న ఘ‌ట‌న‌ల‌పై స్పందించిన ఈసీ సీరియస్‌గా చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీలోని పెట్రోల్‌ బంకుల్లో బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలను నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ అమ్మొద్దని గతంలో పోలీసులు కూడా చెప్పారు. ఇక ఇటీవల చోటుచేసుకున్న ఘటనలో మరోసారి ఎన్నికల సంఘం ఈ ఆదేశాలను జారీ చేసింది.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కూడా పెట్రోల, డీజిల్‌ను బాటిళ్లలో అమ్మొద్దని యాజమాన్యాలకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలు.. పోలీసుల సూచనతో పెట్రోల్‌ బంక్‌ యాజమాన్యాలు కూడా అలర్ట్ అయ్యాయి. మరోవైపు వాహనాల్లో పెట్రోల్‌ ఉన్నట్లుండి అయిపోతే ఏంటి పరిస్థితి అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement