Monday, May 13, 2024

కేరళ భామగా ‘సన్నీలియోన్’

కేరళ కుట్టిలా మెరిసింది శృంగార తార సన్నీలియోన్.  ఎప్పుడూ ట్రెండీ స్టైలిష్ కాస్ట్యూమ్స్ లో క‌నిపించే ఈ సొగ‌స‌రి అందం కేర‌ళ‌కుట్టిగా మారిపోయింది. స‌న్నీలియోన్ ఏంటీ కేర‌ళ కుట్టిగా మార‌డ‌మేంటి అనుకుంటున్నారా.. మీరు విన్న‌ది నిజ‌మే. ఇండియ‌న్ టెలివిజన్ షో ఎంటీవీ స్పిట్స్ విల్లా 13 కోసం కేర‌ళ భామ‌గా మారిపోయింది. ఈ  షో షూటింగ్‌లో భాగంగా ఫొటోషూట్‌లో పాల్గొన్న‌ది స‌న్నీ. కాస్ట్యూమ్ డిజైన‌ర్ హితేంద్ర క‌పొపారా డిజైన్ చేసిన శారీలో కెమెరాకు ఫోజులిచ్చింది. కేర‌ళ సంప్ర‌దాయ చీర‌క‌ట్టూ, బొట్టు, గోల్డెన్ జ్యువెల్ల‌రీతో ఫొటోలు దిగింది. గోల్డ్ విత్ రెడ్ అవుట్ పిట్‌లో బోటుపై వ‌య్యారాలు ఒల‌క‌పోస్తూ.. ధ‌గధ‌గ మెరిసిపోతున్న‌ స‌న్నీలియోన్ ఫొటోలు ఇంట‌ర్ నెట్‌ను షేక్ చేస్తున్నాయి. దేవుడి సొంత దేశంతో ప్రేమ‌లో..#Kerala అంటూ ఇన్ స్టాగ్రామ్‌లో ఫొటోలు షేర్ చేస్తూ క్యాప్ష‌న్ ఇచ్చింది స‌న్నీలియోన్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement