Tuesday, May 28, 2024

TS : ఓటు హక్కు వినియోగించుకున్న సీఎస్​

తెలంగాణ సీఎస్‌ శాంతికుమారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రశాసన్‌నగర్‌లో శాంతికుమారి ఓటు వేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా తప్పని సరిగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. పోలింగ్ కేంద్రాల్లో వసతులు సౌకర్యంగా ఉన్నాయని చెప్పారు.

- Advertisement -

శాంతికుమారితో పాటు ఎన్నికల ముఖ్య అధికారి వికాస్ రాజ్, డీజీపీ రవి గుప్తా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు, ఇతర ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు విధిగా ఓటు హక్కు వినియోగించుకుని ప్రజలంతా ఓటేయడానికి తరలి రావాలని పిలుపునిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement